Thursday, 20 April 2017

మనిషి యొక్క బాధ రెండు రకాలుగా ఉంటుంది.

మనిషి యొక్క బాధ రెండు రకాలుగా ఉంటుంది.

ఎవరైనా తనకు తానే నష్టం కలిగించుకున్నప్పుడు ఎంత బాధనైనా భరించగలుగుతాడు. కాని ఎదుటి వారి వలన తనకు అన్యాయంగా నష్టం కలిగితే మాత్రం జీర్ణించు కోలేడు.

అగ్గి మీద చేయి పెట్టి మనకు మనమే కాల్చుకునే బాధ కంటే ఎవడో వచ్చి కాల్సినప్పుడు కలిగే బాధే కష్టంగా ఉంటుంది.

Friday, 24 March 2017

8th,9th Class Social Studies papers లీకయిపోయాయట?

8th,9th Class Social Studies papers లీకయిపోయాయట?

మన రాష్ట్ర ప్రభుత్వం కన్నుగప్పి కొంతమంది స్వార్ధపరులు ఇలా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకోవడం పరిపాటి అయ్యిపోయింది. ఇది ముమ్మాటికి దేశ ద్రోహం క్రిందే పరిగానిన్చావాల్సి వస్తుంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించనంత కాలం ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. మరిన్ని వివరాలకు క్రింది లింక్స్ చూడండి.




Wednesday, 22 February 2017

"భయంకర తుఫాన్" గూర్చి కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత సినిమా(తెలుగు) San Andreas (2015)

హాయ్ రీడర్స్ ఈరోజు మీకోసం ఒక మంచి సినిమాని పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోరు కొట్టకుండా ఉంటుంది. చూసినంత సేపు చాలా ఉత్కంత భరితంగా ఉంటుంది.మీకు ఖాళీ దొరికినప్పుడు సరదాగా ఈ మూవీ ఎంజాయ్ చేయండి. సినిమా డౌన్లోడ్ లింక్ క్రింద ఇస్తున్నాను.
San Andreas (2015) 720p Telugu Dubbed 

Tuesday, 7 February 2017

ఒక మంచి మాట!

మనిషి అనేక సమస్యలలో మునిగిపోయినప్పుడు బ్రతకడమే ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది.దానిని ఎదిరించిన నాడు మన చుట్టూ బిగుసుకున్న సమస్యలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. కాని మనిషి దాని విషయంలో ధైర్యం చేయడానికి బయపడతాడు. సమస్యలను ఎదిరించి నిలబడిన మరుక్షణం నీ సమస్యలన్నీ నీ కాళ్ళ క్రింద పడిఉండడం తధ్యం.

Wednesday, 1 February 2017

నిహారికా మేడమ్ ఏమయ్యింది?

బ్లాగ్ వివాదా చర్చల్లో ఎప్పుడూ నిలిచి పోరాడే ధీర వనిత నిహారికా మేడం గారు ఈమధ్య బ్లాగు లోకంలో కనిపించడం లేదు. ఆమె వ్రాసే టపాలను ఎక్కువుగా చదివే వాళ్ళలో నేనూ ఒకడిని. ఈమధ్య అగ్రిగేడర్ లలో వెతుకుతుంటే ఈమెగారి బ్లాగు అసలు కనిపించడం లేదు. ఇంతకీ నిహారికా మేడమ్ గారికి ఏమయ్యింది? ఆమెగారు సమాధానం ఇస్తే సంతోషం.